
ఇక ఇలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు జంతు ప్రేమికులు అందరి దృష్టిని ఆకర్షిస్తూ మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇలాంటి వీడియోలు చూస్తే ఒక్కసారిగా మనసు తేలిక పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఇలాంటి ఒక వీడియోనే వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఒక కుక్కకి చేప కనిపించింది అంటే చాలు లటుక్కున నోట్లో వేసుకొని మింగేయడం మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక పెంపుడు కుక్క మాత్రం ఒక గోల్డ్ ఫిష్ ప్రాణాలు కాపాడింది.
ఈ వీడియో ట్విటర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణంగా చేపలు నీటిలో నుంచి బయటపడ్డాయి అంటే చాలు కొద్దిసేపటికి గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోతాయి. ఇక ఇళ్లల్లో పెంచుకునే చిన్ని చేపలు అయితే మరింత సున్నితంగా ఉంటాయి అని చెప్పాలి. అయితే ఓ ఇంట్లో వారు గోల్డ్ ఫిష్ లను పెంచుకుంటున్నారు. అందులో గోల్డ్ ఫిష్ నేలపై పడిపోయింది. దీంతో అది చూసిన పిల్లి ఆ గోల్డ్ ఫిష్ ను తిరిగి నీటిలో వేయలేకపోయింది. అదే సమయానికి అక్కడికి ఒక పెంపుడు కుక్క వచ్చింది. నోటితో గోల్డ్ ఫిష్ ను కరుచుకొని నీటిలో వేసింది. దీంతో హమ్మయ్య అనుకున్న గోల్డ్ ఫిష్ హాయిగా నీటిలో ఈదడం మొదలుపెట్టింది.