ఇటీవలే అమెరికాలో మిస్ ఇండియా యూఎస్ఏ పోటీ నిర్వహించారు. అయితే ఈ పోటీలలో ఎంతో మంది భారత సంతతికి చెందిన వనిత లు  సత్తా చాటి ఇండియన్స్ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఎంతో అద్భుతమైన ప్రతిభతో పాటు ఆకట్టుకునే సౌందర్యం కూడా తమ సొంతం అంటూ నిరూపించారు అమెరికన్ భారత అమ్మాయిలు. ఏకంగా మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని దక్కించుకున్నారు వైదేహి డోంగ్రే. అంతేకాదు మొదటి రన్నరప్గా నిలిచారు మరో అమెరికన్ భారత వనిత  ఆర్సి లాలని. దీంతో వీరిద్దరికి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి  ప్రస్తుతం వైదేహి డోంగ్రే ఒక పెద్ద సంస్థకు బిజినెస్ డెవలపర్ గా పనిచేస్తున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వైదేహి ఎన్నో అంతర్జాతీయ అధ్యయనాలలో కూడా పాల్గొని తన ప్రతిభను చాటారు. అంతేకాదు వైదేహి కి డ్యాన్స్ అంటే కూడా ఎంతో ఇష్టం. ఓవైపు ఉన్నతమైన ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇలా తన ఫిట్నెస్ ఫై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్ఏ- 2021 పోటీల్లో పాల్గొని ఏకంగా ఫస్ట్ ప్లేస్ లో వచ్చి కిరీటాన్ని సొంతం చేసుకుంది వైదేహి డోంగ్రే. అయితే ఈ పోటీలలో ఫస్టు రన్నరప్గా నిలిచిన అర్ష లలాని ఏకంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నప్పటికీ  టైటిల్ సాధించడం గమనార్హం.


 అంతేకాదు ఈ టైటిల్ను గెలుచుకున్న మొదటి అమెరికన్ ఇండియన్ ముస్లింగా కూడా అర్ష లలానీ రికార్డు సృష్టించారు  ఇలా మెషిగన్ నుంచి వైదేహి.. జార్జియా నుంచి అర్ష టైటిల్ గెలుచుకోవడం గమనార్హం. అయితే ఇటీవలే న్యూ జెర్సీ లో నిర్వహించిన ఈ పోటీలలో ఇక భారతీయ అమెరికన్ కుటుంబాలతో మొత్తం అక్కడి వేదిక మొత్తం కళకళలాడిపోయింది. అయితే మిస్ ఇండియా యుఎస్ఏ పోటీలతో పాటు టీన్ ఇండియా యూఎస్ఏ పోటీలు కూడా గత 40 సంవత్సరాల నుంచి అక్కడ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి 61 మంది పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Usa