యూపీలో 11 ఏళ్ల అమ్మాయి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాలిమార్ గార్డెన్ ఏరియాలో కొద్దిరోజులుగా ఓ కుటుంబ నివాసం ఉంటుంది. అయితే ఈ మధ్య ఓ విషయంలో తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. దాంతో మనస్థాపానికి గురైన అమ్మాయి కోపంలో బ్లాక్ మెయిల్ చేయాలని డిసైడ్ అయింది. తండ్రి లాప్ టాప్ నుండి అతడి ఫోన్ కు మెసేజ్ పంపించింది.

కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే పిల్లలను చంపేస్తాను అంటూ బెదిరించింది. దాంతో కంగారు పడ్డ తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం షాక్ అయ్యారు. పదకొండేళ్ల కుమార్తె ఈ మెసేజ్ చేసింది అని గుర్తించారు. ఇక అమ్మాయిని నిలదీయగా తనను తిట్టడం వల్లనే బ్లాక్ మెయిల్ చేశానని క్లారిటీగా చెప్పేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: