గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో వివాదంలో ఇరుక్కున్నారు. కొడాలి నాని పీఏ లక్ష్మోజీ  వేధిస్తున్నారని వార్డు వాలంటీర్‌ మేరుగు లలిత ఆరోపించడం కలకలం సృష్టించింది. కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు పలువురికి ఆమె ఫిర్యాదు చేంది. తాను గుడివాడ బాపూజీనగర్‌ 13వ వార్డులో నివసిస్తున్నానని.. తిరుపతమ్మ చెరువు గట్టున మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నామని ఆమె తెలిపింది. 3రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పని చేస్తుంటే... మా సామాన్లు చెల్లాచెదురుగా పడేసి తనపై దాడి చేశారని ఆమె తెలిపింది.


తనను కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారని.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదుచేశానని ఆమె వివరించారు. బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి వస్తుందని పోలీసులు అన్నారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ దగ్గరకు వెళ్తే ఆయన తనతో అసభ్యంగా మాట్లాడారని.. లక్ష్మోజీ తన బంధువులు రమేష్‌, సురేష్‌లకు అండగా ఉంటూ..తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లలిత కన్నీరు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: