తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం యాత్ర చేపట్టామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ వస్తే మార్పు వస్తుందని ఉద్యమకారులు అనుకున్నారని.. నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయనుకున్నారని.. జర్నలిస్టులు జీవితాల్లో మార్పు రావాలనుకుంటున్నారని.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మార్పు రావాలని ప్రతిఒక్కరు కోరుకుంటున్నారని.. కాబట్టి మార్పు తీసుకురావడానికి హాత్ సే హాత్‌ జోడో యాత్ర చేపట్టామని.. ఎవ్వరు చెప్పినా... కేసిఆర్ వినడు...ఆయనకు తెలియదని రేవంత్ రెడ్డి అన్నారు.


రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ స్పూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టామన్న రేవంత్ రెడ్డి... ఏ కార్యక్రమం చేపట్టినా ఆడపిల్ల ఎదురు రావాలనుకుంటామని.. సీతక్క ఆడబిడ్డగా ఆమె ప్రాతినిధ్యం వహించే మేడారం నుంచి మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని.. ముందస్తు ఎన్నికలు పిచ్చొడి చేతిలో రాయి లాంటిదని.. చంద్రశేఖర్ రావు పీడ విరగడకోసమే యాత్ర చేస్తున్నామని రేవంత్‌ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: