రూ. 3 వేల కోట్ల రూపాయల కుంభకోణం కోసమే స్మార్ట్ మీటర్లతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఆరోపిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పే లెక్కలు కరెక్టు అయితే ప్రయాస్ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదని కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని రైతులను బెదిరించి స్మార్ట్ మీటర్ల అంగీకార ప్రత్రాలను తీసుకున్నారని కిమిడి కళావెంకట్రావు మండిపడ్డారు.

రూ.12 వేలు ఖరీదు చేసే ఒక్కో స్మార్ట్ మీటర్ ను 30 వేలు పెట్టి కొని 3000 కోట్ల భారీ కుంభకోణానికి రంగం సిద్దం చేశారని కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు కట్టబెట్టారని కిమిడి కళావెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. షిర్డీ సాయి కంపెనీ అవినాష్ రెడ్డికి బినామీ అని కిమిడి కళావెంకట్రావు దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: