జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్ర కీలకం. రాష్ట్రానికి అనేక అవార్డులు రావడంలో వారి శ్రమ ఎంతో ఉంది. రేయింబవళ్లు కష్టపడుతూ పని ఒత్తిడితో కొంతమంది జేపీఎస్‌లు చనిపోయారు కూడా. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.


నాలుగేళ్ల ప్రొబిషన్‌ కాలం ముగిసినందున వారి వెంటనే  రెగ్యులరైజ్‌ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. వారితో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. జేపీఎస్‌ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వారు దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  సానుకూలంగా స్పందించి సమ్మెను విరమింపజేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. ఉద్యోగ పోతుందనే భయంతో ఉన్న  వారు సమ్మె చేస్తున్నారంటే వారిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr