మనలో చాలామంది లోన్లు తీసుకోవటానికి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే లోన్ అంటేనే అప్పు... అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. లాగే సమయానికి ఎప్పటికప్పుడు తీర్చితే కూడా బాగానే ఉంటుంది. కానీ ఏమాత్రం తీర్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకున్నట్లయితే మాత్రం తెగ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం... తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేట్లు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వడ్డీరేట్లు తక్కువగా ఉండే బ్యాంక్ లోన్ల జోలికి వెళ్లటమే సరియైన పని. అయితే ఇక తాజాగా దేశీ దిగ్గజ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించేశాయి. దీంతో ఈ బ్యాంకుల్లో రుణం తీసుకునే వారికి కాసింత ఊరట కలుగనుంది. రుణ రేట్లు తగ్గే అవకాశముంది.




హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు MCLR తగ్గించింది. ఫిబ్రవరి 8 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ కొత్త రేట్లను ఒకసారి స్పష్టంగా గమనిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.85 శాతంగా ఉంది. నెల ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 7.05 శాతంగా, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.2 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, అలాగే 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 7.4 శాతంగా ఉంది. కేవలం ఈ విధంగా ఈ ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ ని తగ్గించింది. కెనరా బ్యాంక్ నెల ఎంసీఎల్ఆర్ 6.7 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం ఉండగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా ఉంది. అలాగే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉంది. ఇక బ్యాంకుల ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో రుణ రేట్లు తగ్గుతాయి. దీంతో లోన్ తీసుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: