ఉత్తర్ ప్రదేశ్‌ లో ఘోరం చోటు చేసుకుంది . రాష్ట్రం లోని మొరదాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న హెల్త్  వర్కర్ మహిపాల్ టీకా తీసుకున్న 24 గంటల్లోనే  మృతి చెందారు. అయన  శనివారం తొలి దశలో టీకాలో భాగంగా కోవిషిల్డ్  వ్యాక్సిన్  తీసుకున్నారు. అయితే . దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న వేల ఈ విధంగా జరగడం తో ప్రకంపలను రేపింది .. అప్పటికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ వార్త అలజడిని సృష్టించింది ..
టీకా తీసుకున్న అనంతరం మహిపాల్  ఇబ్బందికరంగా ఫీలయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన్ని  ఆస్పత్రికి తీసుకురాగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.  .. మహిపాల్ కుటుంబ సభ్యులు ఆయనకు కరోనా సోకలేదని చెబుతున్నారు.. ఇక వార్డు బాయ్ మహిపాల్ కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మరణించాడని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు..  దీంతో  వార్డ్ బాయ్ మృతి పై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి ..  దీంతో వైద్యులు  కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా మహిపాల్ మరణించాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే తెలుసుకునే ప్రయత్నం చేశారు .. అయితే ఎట్టకేలకు వార్డ్ బాయ్ మరణం పై అసలు కారణం ఏంటో తెలుసుకున్నారు ..  మరి  అయన మృతికి గల కారణమేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం  ..

మహిపాల్ మరణం పై బంధువుల నుండి  ఆరోపణలు వస్తున్నా నేపథ్యంలో అధికారులు ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు. దీంతో మహిపాల్  మృతదేహానికి ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం పోస్టుమార్టం నిర్వహించింది ..  అయితే పోస్టుమార్టం అనంతరం వచ్చిన రిపోర్ట్ బట్టి  అయన  మరణానికి కొవిడ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు తేల్చారు...  గుండెపోటు కారణంగానే ఆయన మరణించాడని స్పష్టం చేశారు.
 






మరింత సమాచారం తెలుసుకోండి: