అయితే అలాంటిది విషపూరితమైన నాగుపాము కనిపిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే ఇక్కడ ఒక మహిళకు ఇలాంటి అనుభవం ఎదురయింది. పామును చూడడం కాదు ఏకంగా నిద్రపోతున్న ఆ మహిళ కాళ్ళను నాగుపాము చుట్టేసింది. అంతేకాదు పడగవిప్పి బుస కొట్టడం మొదలుపెట్టింది. దీంతో ఆ మహిళ ఎంతగానో భయపడిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. అమీర్పూరు జిల్లా దేవి గంజి గ్రామంలో నిఖిలేష్ కుమారీ యాదవ్ రాఖీ పండుగ సందర్భంగా సొంత ఇంటికి వచ్చింది.
అయితే ఆమె నిద్ర పోతున్న సమయంలో ఒక పాము ఆమె కాలికి చుట్టుకుంది. అయితే విష సర్పాన్ని చూడగానే ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. కానీ ఆరోజు శ్రావణ సోమవారం కావడం.. ఇక శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శివుడి మహిమే అనుకుంది. దీంతో ఇక ఆమె పామును చూస్తూనే శివయ్యను ధ్యానం చేయడం మొదలు పెట్టింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారూ. అయితే మూడు గంటల పాటు ఆమె ధ్యానం చేస్తే కాలికి చుట్టుకున్న పాము కనీసం ఆమెపై దాడి చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి