కోర్టు చెప్పినా కూడా పాకిస్తాన్ తన గిల్గిస్తాన్‌.. ఇంకా పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ ఎలక్షన్లు నిర్వహించలేదు. కోర్టు చెప్పినట్లు మొన్న మే 14న ఎలక్షన్లు జరగాలి. కానీ అలా జరగలేదు అక్కడ. అదే  ప్రజాస్వామ్య విరుద్ధమంటే. అలాంటివి పాకిస్తాన్లో ఇప్పుడు చాలా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని పదవీ విరమణ చేయమని అక్కడ ప్రభుత్వమే ఆయన ఇంటి ముందు, సుప్రీంకోర్టు ముందు ధర్నా చేస్తున్న, ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది.  


అక్కడ ఇది మరొక ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య. అసలు ఇవన్నీ చూసి అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని అమెరికా ప్రతినిధులు వాపోతున్నారట. మరో పక్కన అక్కడ ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏంటంటే సైన్యం ఇమ్రాన్ ఖాన్ ని అరెస్టు చేసి తీసుకు వెళ్లిన సందర్భంలో అక్కడ జరిగిన అల్లర్లు, దాడులలో సైనిక స్థావరాలు, సైనిక కార్యాలయాలు ఇంకా సైనిక విన్యాసాలు చేసే యుద్ధ విమానాలు ఇవన్నీ ధ్వంసం అయ్యాయి అని తెలుస్తుంది.


ఇలా అల్లర్లు చేసిన ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన 1500 మంది వరకు అక్కడి షాభా షరీఫ్ ప్రభుత్వం ద్వారా అరెస్టు అయ్యారని తెలుస్తుంది. ఇది ప్రజాస్వామ్య కి సంబంధించి మరొక కొత్త రకమైన అంశం. మరొక పక్క సైన్యం ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి హెచ్చరికలు జారీ చేసిందని తెలుస్తుంది. అది ఏమంటుంది అంటే ఇమ్రాన్ ఖాన్ ను ప్రజాస్వామ్య కోర్టు మధ్యలో పెట్టడానికి బదులుగా, సైనిక కోర్టులో ప్రవేశపెడతామని చెప్తుందట.


కేవలం సైనిక వర్గాల మధ్య పెట్టాల్సిన కోర్టు మార్షల్ ఇమ్రాన్ ఖాన్ పైన పెడుతుందట అక్కడ సైన్యం. ఇది కూడా ఒక ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యే. అసలు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఉనికిని గురించి 67 మంది అమెరికా ప్రజాప్రతినిధులు సంతకాలు పెట్టి ఒక లేఖ రాశారట. ఈ రకంగా పాకిస్తాన్ కు అమెరికా షాక్ ఇచ్చిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: