
అణు దూళి అణుబాంబులు పేలినప్పుడు ఏర్పడే ధూళి ఒక మేఘములా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన మేఘం అక్కడ వాతావరణాన్ని కలుషితం చేసేస్తుంది. దాంతో అంతా రసాయన మయంగా మారిపోతుంది. వర్షాలు కురవక, పంటలు పండక అక్కడ పొలాలు బీడులుగా మారిపోతాయి. ఇదంతా ఈ అణు దూళి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రేడియోధార్మిక మేఘాలు యూరప్ వైపు మళ్లుతున్నాయని రష్యా పేర్కొంది.
బ్రిటన్ వాళ్లు ఉక్రెయిన్ కి అందించిన ఆయుధాలలో ఈ అణు మూలకాలు ఉన్నాయట. అయితే మేము వాటిని ధ్వంసం చేసేసామని చెప్తుంది దర్జాగా రష్యా. దానివల్ల రేగిన అణు దూళి ఒక మేఘంలా ఏర్పడి ప్రపంచం వైపుకు దూసుకు వస్తుందని చెప్తుంది రష్యా. అంటే అది రష్యా చెప్పేది ఏంటంటే మేము చిన్నపాటి అణ్వస్త్రాలను, అణ్వాయిదాలను ధ్వంసం చేసామని చెప్పుకుంటుంది.
ఒకరకంగా ఈ మాట చెప్పి అది ప్రపంచ దేశాలన్నిటిని హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. బ్రిటన్ ఉక్రెయిన్ కి అందించిన యురేనియం షెల్లను నాశనం చేయడం వల్ల రేడియోధార్మిక క్లౌడ్ ఏర్పడిందని రష్యా భద్రతా మండలి కార్యదర్శి నిక్కీ మాస్యూస్ చెప్పారు. పోలాండ్లో రేడియోధార్మికత పెరుగుదల కనుగొనబడిందని కూడా చెప్పాడు. ఒకప్పుడు రష్యా లో ఉండి విడివడిన పోలాండ్ ను మొదటగా కబళిచడానికి అటు వైపుగా వెళ్తుంది ఈ అణు దూళి.