
ఇది మంచి పరిణామమే.. ఏ పార్టీ అయినా... దేశానికి వెన్నెముక వంటి రైతుల పక్షాన నిలవాల్సిందే.దీనిని ఎవరూ కాదనరు. పవన్ చేసే రైతు భరోసా యాత్ర కు అన్ని వర్గాలు కూడా మద్దతుగా నిలుస్తాయని కూడా అంచనావేయొచ్చు. అక్కడే ఇక్కడే మూడు కీలకమైన ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఎంతైనా.. రాజకీ యాల్లో.. నాయకులు చేసిన పాలిటిక్స్.. వేసిన అడుగులు.. వారు మరిచిపోయినా.. జనాలు మాత్రం మరిచి పోరు కదా! ఏం చేస్తాం.. ఇప్పుడు పవన్‌కు కూడా ఇదే వెంటాడుతోంది. గతంలో చంద్రబాబు సర్కారుకు పవన్ పరోక్షంగా మద్దతిచ్చారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు.
అయితే.. రైతు రుణ మాఫీ చేస్తామని.. చంద్రబాబు ఇచ్చిన హామీ మళ్లీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా నెరవేర్చుకోలేక పోయారు. సగానికిపైగా సుమారు 2 వేల కోట్లు.. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. .చంద్ర బాబు హయాంలో అంటే ఎన్నికలకు ముందు.. రైతులకు ఇచ్చిన హామీ మిగిలిపోతే.. జగన్ సర్కారు వాటిని తిరిగి చెల్లించారు. రేపు ప్రజల్లోకి పవన్ వెళ్తే.. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే.. చంద్రబాబు సర్కారు ఏర్పాటులో తనది కీలక పాత్ర అని ఇప్పటికీ.. ఆయన చెప్పుకొంటారు కాబట్టి.
ఇక, ఇప్పుడు జగన్ ప్రభుత్వం వూరూరా.. వాడవాడలా..ఏర్పాటు చేసిన.. రైతు భరోసా కేంద్రాలు మంచివా .. కాదా? రేపు మీరే అధికారంలోకి వచ్చాక.. వీటిని కొనసాగిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా పవన్ క్లారిటీ చేయాలి. ఎందుకంటే.. వీటిని కొనసాగించాలని అనుకుంటే.. జగన్ సర్కారు రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయం.. మంచిదేనని.. పవన్ ఒప్పుకొన్నట్టుగానే అనుకోవాలి. లేకుంటే.. ఆయన ఇంతకు మించి ఏం చేస్తారో.. చెప్పాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా.. పవన్ ఏం చేసినా.. ప్రయోజనం శూన్యం.
ఇక, రైతులకు ఇస్తున్న.. పెట్టుబడి సాయం రాష్ట్రం నుంచి 7500 అందుతోంది. దీనికి కేంద్రం ఇస్తున్న 6000 కలిపి మొత్తంగా 13500 అందిస్తున్నారు. ఈ విషయంలో పవన్ ఏం ప్రశ్నిస్తారు. ఇస్తున్న సొమ్మును ఇవ్వడం లేదని.. రైతుల ఖాతాలకు చేరడం లేదని చెబుతారా..? లేక.. ఇంతకన్నా తాముఎక్కువ ఇస్తామని చెప్పగలరా? మరీ ముఖ్యంగా.. మద్దతు ధరల విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం.. సంచలనమని కేంద్రమే చెబుతోంది.
ఎందుకంటే.. అత్యంత చిన్న చిన్న ఉత్పత్తులకు కూడా.. అంటే.. అరటి.. బత్తాయి వంటివాటికి కూడా మద్దతు ధరలు ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో నష్టపోకుండా.. రైతులు వాటిని విక్రయించుకుంటున్నారు. మరి ఈవిషయంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. రైతుల విషయంలో పవన్ రాజకీయాలకు దిగితే.. అసలు సిసలు ప్రశ్నలు.. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఆయన మానసికంగా సిద్ధంగా ఉండాలని అంటున్నారు పరిశీలకులు.