తెలంగాణ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ నేత కొండా సురేఖ బిగ్ షాక్‌ ఇచ్చారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఆమెకు చోటు దక్కలేదు. అంతే కాకుండా ఆమెను కేవలం ప్రదేశ్ ఎగ్జికూటివ్ కమిటీ మెంబర్ నియమించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో రాజకీయ బ్రతుకు దెరువు కోసం మూటముళ్ళె సద్దుకొని ఇతర పార్టీల నుండి వచ్చిన వారితోపాటు, ఇంకా కనీసం ఎం.ఎల్.ఎ.గా కూడా ఎన్నిక కానివాళ్ళను నామినేట్ చేసి.. తనను మాత్రం విస్మరించారని ఆమె ఆగ్రహంగా ఉన్నారు.


ఇది తనను అవమాన పర్చినట్టుగా భావిస్తున్న ఆమె.. తెలంగాణ ప్రదేశ్ ఎక్జిక్యూటివ్ కమిటీ మేంబర్ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మాకు పదవులు ముఖ్యం కాదని.. నేను వై.ఎస్.ఆర్. కుటుంబం కోసం మంత్రి పదవినే వద్దు అనుకున్నదాన్నని కొండా సురేఖ గుర్తు చేశారు. నమ్ముకున్న వ్యక్తి కోసము నా మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న దాన్ని అని గుర్తు చేసిన కొండా సురేఖ.. నమ్మిన పార్టీ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటానన్నారు. నేను ఈ కమిటీలో కంటిన్యూ అవ్వడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదన్న కొండా సురేఖ.. అందుకని నాకు ఇచ్చిన తెలంగాణ ప్రదేశ్ ఎక్జిక్యూటివ్ కమిటీ మేంబర్ రాజీనామా చేస్తున్నానని.. తనకు పదవులు ముఖ్యం కాదు. ఆత్మాభిమానం ముఖ్యం.. అని లేఖలో తెలిపారు.


నా పదవికి రాజీనామా చేస్తూ, నేను నా భర్త వరంగల్ ఈస్ట్ మరియు పర్కాల నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో వుంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ఒక సామాన్య కార్యకర్తలలాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని కొండా సురేఖ  లేఖలో తెలిపారు. అంతే కాదు.. తన  బయోడాట కూడా దీని వెంట జతపర్చుచున్నానని.. నేను ఎన్ని పదవులు పార్టీలో నిర్వహించానో అందులో చూసుకోమని రేవంత్ రెడ్డికి కొండా సురేఖ  సలహా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: