
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, రష్యా 227 మిలియన్ డాలర్ల విండ్ఫాల్లో మూడింట ఒక వంతును విదేశాల్లో ఆదా చేసుకోగలిగింది. మరియు గత సంవత్సరం దాని కమోడిటీ ఎగుమతుల నుండి సుమారు 80 బిలియన్ డాలర్లు నగదు స్థిరాస్తి హోల్డింగ్స్‌తో పాటు విదేశాలలో ఉన్న అనుబంధ సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదించబడింది. ఉక్రెయిన్ పై నేర పూరిత యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల ఆ దేశంలో ఆర్థిక నిరాశ అనేది ఏర్పడింది.
ఒక పక్కన రష్యా ఆదాయం ప్రపంచంలోని పరిస్థితులు ఎలా ఉన్నా పెరుగుతుందే గాని తగ్గడం లేదు, ఆగడం లేదు. దానికి బలమైన ఉదాహరణే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రేకపూరితమైన యుద్ధం జరుగుతున్నా కూడా, అంత విధ్వంసం మధ్యలో కూడా, మిగిలిన ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా ఉన్నా, ముఖ్యంగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితికి తీవ్ర సంక్షోభం కలిగిన పరిస్థితి వచ్చినా సరే, రష్యా ఆదాయం మాత్రం వీటితో సంబంధం లేకుండా మామూలుగానే పెరిగింది గాని తగ్గలేదు. రష్యా ఈ విషయంలో టాక్టికల్ గా వ్యవహరించి సక్సెస్ అయిందని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.