
కానీ ఇప్పటి వరకు దాని నిర్మాణం జరగలేదు. 2018, 2019 లో సెక్రటేరియేట్ నిర్మాణం పూర్తి చేస్తే చంద్రబాబు పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది. కానీ ఏపీ రాజధానిలో అన్ని తాత్కాలిక భవనాలను మాత్రమే నిర్మించారు. ప్రస్తుతం సరైన రాజధాని లేక, శాశ్వత సెక్రటెరియేట్ లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మారిన పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి ఇది పూర్తి చేయక, విశాఖపట్నంలో రాజధానిని నిర్మించాలని చూస్తున్నారు.
ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం, విదేశాలతో మార్కెటింగ్ వ్యవస్థ బాగుంటుంది. ముఖ్యంగా విశాఖ పట్నం డెవలప్ మెంట్ అయిన ప్రాంతం. కొత్తగా రాజధానిని నిర్మించాలంటే లక్షల కోట్లు కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఉన్న అతి పెద్ద నగరాన్ని విస్తరించి అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మరింత డెవలప్ చేస్తే విశ్వనగరంగా మార్చవచ్చు. దీనికి పెద్దగా సమయం పట్టదు. అల్రడీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. జగన్ ఆలోచనలు ఇలా.. చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉండటంతో ఏపీకి ఇంకా రాజధాని లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తయారైంది.