
కానీ కౌంటర్ ఇంటిలిజెన్స్ విభాగం మాత్రం అలా కాదు. ప్రపంచంలో శత్రువు ఏ మూలలో దాక్కున్న వాళ్లని అంతమొందించడం. అయితే దీనికి హోం శాఖ క్లియరెన్స్ అవసరం ఉంటుంది. దావూద్ ఇబ్రహీం, చోట రాజన్ లాంటి వారు పాకిస్థాన్ లో ఎక్కడ దాక్కున్నారు. ఏ మూలన ఏ పేరుతో బతుకుతున్నారనే వివరాలు అన్నింటిని భారత్ పాక్ ముందు పెట్టినా పాకిస్థాన్ అసలు పట్టించుకోలేదు. వారిని అరెస్టు చేయలేదు. వారు దేశంలోనే లేరని చెప్పేది. కానీ పాక్ లో రాజకీయ పార్టీలకు ఫండింగ్ కూడా ఇచ్చేది వారేనని అందుకే వారిని పాక్ కాపాడేదని తెలుస్తోంది.
ముంబయి ఉగ్రవాద దాడులకు కారణమైన అబ్దుల్ సలామ్ బుట్టానీ అనే వ్యక్తి ప్రస్తుతం పాకిస్థాన్ లోని పెషావర్ జైలులో చంపబడ్డాడు. బుట్టానీ పై గతంలోనే ఐక్య రాజ్య సమితి నిషేధించింది. భారత్ కూడా అన్ని ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందజేసింది. దీంతో పాక్ అబ్దుల్ సలామ్ బుట్టానీని హౌస్ అరెస్టు చేసింది. అతడి ఇంటి ముందు బాంబు దాడి జరగడంతో ఇద్దరు పవారా కాసే సైనికులు చనిపోయారు. దీంతో పెషావర్ జైలుకు తరలించారు. అక్కడ అబ్దుల్ సలామ్ బుట్టానీ ని హత్య చేశారు. పాకిస్థాన్ లో దాదాపు 10 మంది వరకు ఉగ్రవాదులు కాల్పుల్లో చనిపోవడం, ఉరి వేసుకొని చనిపోయిన సంఘటనలు జరిగాయి. ఇందులో భారత్ రా విభాగం వారి పాత్ర ఉన్నట్లు పాకిస్థాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.