
ఇక్కడ రష్యా కూడా జర్మనీకి తక్కువ ధరకు ఆయిల్ ను అమ్మేది. కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్దం తర్వాత జర్మనీ ఉక్రెయిన్ వైపు నిలబడటం, ఆయిల్ కొనక్కోకపోవడంతో జర్మనీ తీవ్రంగా నష్టపోతూనే ఉంది. జర్మనీలో ప్రస్తుతం కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉద్యోగాలు పోతున్నాయి. కంపెనీలు మూతపడుతున్నాయి. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు బయటకు వచ్చి రోడ్డెక్కుతున్న పరిస్థితి.
ఉక్రెయిన్ కోసం మన దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నాం చేసుకోవాల్సిన అవసరం ఏముంది. అక్కడ పౌరుల గురించి ఆలోచిస్తే మన దేశంలో పౌరులకు తిండి గింజలు దొరక్క అవస్థలు పడుతున్నాం అంటూ ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. నాటో నుంచి జర్మనీ బయటకు వచ్చేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముందు జర్మనీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. రష్యా నుంచి ఆయిల్ తక్కువ రేటుకు కొని దాన్ని మిగతా దేశాలకు ఎక్కువకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఇప్పుడు అమెరికా, గల్ప్ దేశాల నుంచి ఎక్కువ రేటుకు కొనాల్సి వస్తుంది. అది పరిమితంగానే దొరకుతుంది. ఎక్కువ ధర పెట్టాల్సి వస్తోంది. సమస్యల వలయంలో చిక్కుకునే బదులు నాటో నుంచి బయటకొస్తే బాగుంటుందంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.