తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా 1990 సమయంలో తెలుగు ఇండస్ట్రీని మెగాస్టార్ ఏలుతున్న రోజులవి. ఆయన సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునే నటీనటులు ఎంతోమంది. ఆయన సినిమాల్లో నటించాలని ఎంతోమంది నటీనటులు ఎగబడేవారు. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమాల్లో అవకాశం కోసం ఇతర సినిమాల్లో నటించే అవకాశాలను సైతం వదులుకునే వారు. ఎందుకంటే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అంత క్రేజ్ ఉండేది మరి. అయితే కొంత మంది హీరోయిన్లకు మెగాస్టార్ తో నటించే ఛాన్స్ వస్తే వాళ్లు మాత్రం ఆ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోకుండా మిస్ చేసుకున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం...

1) రాశి : 'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఎన్ ఆదిత్య, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ అప్పుడు ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ల లేదు. అయితే ఆ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నప్పుడు మెగాస్టార్ కోసం హీరోయిన్ గా రాశి ని సంప్రదించారట. కానీ అప్పటికే ఆమె రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మెగాస్టార్ ప్రాజెక్టుకు నో చెప్పిందట.

2) ఇంద్రజ : చిరంజీవి కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా 'బావగారు బాగున్నారా' ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు ఇంద్రజని అనుకున్నారట. కానీ పలు అనివార్య కారణాలవల్ల ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంది ఇంద్రజ.

3) అశ్విని : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భానుమతిగారి మొగుడు' చిత్రంలో నటిస్తున్న సమయంలో చిరంజీవి నటిస్తున్న 'జేబుదొంగ' సినిమా లో అశ్విని ని హీరోయిన్గా సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పడంతో ఆమె స్థానంలో భానుప్రియను తీసుకున్నారట.

4) ఆమని : చిరంజీవి నటించిన 'రిక్షావోడు' సినిమాలో హీరోయిన్ గా నగ్మా ప్లేస్లో ముందు ఆమని ని అనుకున్నారట. కానీ ఎందుకో తెలియదు కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుంది ఆమని.


మతంగా అప్పట్లో మెగాస్టార్ సినిమా లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఈ నలుగురు హీరోయిన్లు మిస్ చేసుకోవడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: