68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక శుక్రవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన అనేక సినిమాలకు చిత్రాలకు అవార్డులు అయితే దక్కాయి.


ఇక జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో సినిమా పురస్కారం అందుకుంది. చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమాను పీరియడ్‌ రొమాంటిక్ డ్రామాగా సందీప్ రాజ్‌ తెరకెక్కించారు. సుహాస్ మరియు దినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్‌ క్యారెక్టర్లో.. పవర్‌ ఫుల్ విలన్‌గా సునీల్ జీవించారు. ఇక ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ (అల వైకుంఠపురంలో )కి కూడా అవార్డు దక్కింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.


అలాగే ఉత్తమ కొరియోగ్రాఫీ అవార్డు ను సంధ్యా రాజు (నాట్యం సినిమా) కు దక్కింది. అలాగే ఆమెకు ఉత్తమ డ్యాన్సర్ గా కూడా ఆమెకు అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ మేకప్ మెన్ గా టీవీ రాంబాబు (నాట్యం)కు అవార్డు దక్కింది. ఇక జాతీయ స్థాయి ఉత్తమ నటులుగా హీరో సూర్య మరియు అజయ్ దేవగన్ లకు అవార్డులు లభించగా ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళికి అవార్డ్ దక్కింది. 68వ జాతీయస్థాయి చలన చిత్ర పురస్కార విజేతలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


ఈ దఫా పురస్కారాల్లో ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం కొంత సంతోషించదగ్గ పరిణామం అంటూ ఆయన పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా శ్రీ ఎస్.ఎస్.తమన్ (అల వైకుంఠపురం), ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫోటో' జాతీయ పురస్కారాలు కైవశం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పవన్ అన్నారు. వీరందరికీ అభినందనలు తెలిపిన పవన్, ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: