
ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి దానితో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన చరణ్, తప్పకుండా ఈ మూవీ కూడా తన కెరీర్ కి మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా శంకర్ మార్క్ మెసేజ్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఎన్నో నెలల క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ నుండి ఇప్పటివరకు ఒక్క అప్ డేట్ కూడా యూనిట్ నుండి రాకపోవడంతో పలువురు చరణ్ ఫ్యాన్స్, దిల్ రాజు గారు కాస్త మా గురించి ఆలోచించండి, మాకు మోక్షం ఎప్పుడు, మా హీరో గారి మూవీ అప్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్స్ కొనసాగిస్తున్నారు. మరి ఇవి చూసిన రాజు గారు ఎంతవరకు స్పందిస్తారో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దర్శకుడు శంకర్ కూడా కసిగా వర్క్ చేస్తున్నారని, కెరీర్ పరంగా ఆయనకు కూడా మంచి సక్సెస్ అవసరం కనుక, తప్పకుండా దీనిని భారీ సక్సెస్ కొట్టేవిధంగా తీస్తున్నారనేది ఇన్నర్ వర్గాల టాక్. ఇక చరణ్ దీని తరువాత యువి క్రియేషన్స్ వారి నిర్మాణంలో జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఒక భారీ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.