
ప్రేక్షకులును మెప్పించలేకపోయాయి..జక్కన్న చెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా ఎనలేని పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత ప్రతి మూవీని పాన్ ఇండియాగా ప్లాన్ చేశాడు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ అంతగా ప్రేక్షకులును మెప్పించలేకపోయాయి. ఇక ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ పై పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చూసి దానిపై ఆశలు వదిలేసుకున్నారు. దీంతో సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపై హోప్స్ ఉంచుకున్నారు డార్లింగ్ వీరిభామానులు. అయితే ప్రభాస్ మాత్రం అవేం పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటుపోతున్నాడు.
బొక్కబోర్ల పడుతున్నాయని.
ఈ క్రమంలోనే కామెడీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ లలో ఒకరు మారుతి. ఆయనతో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు మొదటగా ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కానీ ఆ తర్వాత మారుతితో సినిమా చేయొద్దని ప్రభాస్ ని ఫ్యాన్స్ కోరారు. ఎందుకంటే గత కొంతకాలంగా మారుతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడుతున్నాయని వద్దంటున్నారు. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన పక్కా కమర్షియల్ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మారుతితో సినిమా చేయడం కరెక్ట్ కాదని అభిమానుల వాదన. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో మారుతి-ప్రభాస్ కాంబో మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చేందుకు కూడా భయపడ్డారు. ఏ అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని జంకుతున్నారు.
ఏమైనా చెప్పండి..
తాజాగా సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా మూవీ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా మారుతు హాజరయ్యారు. సినిమా గురించి, హీరో సంతోష్ గురించి మారుతి మాట్లాడి స్పీచ్ ముగించారు. మారుతి స్పీచ్ కంప్లీట్ అయ్యాక.. హీరో సంతోష్ శోభన్ వచ్చి ''ప్రభాస్ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా.. ప్రభాస్ సినిమా గురించి ఏమైనా చెప్పండి..'' అని అడిగాడు. దీంతో ''ఫ్యాన్స్ నన్ను కొడతారు'' అని నవ్వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మారుతి. ఇప్పుడు మారుతి అలా సరదాగా ఉన్నా.. అప్డేట్ ఇస్తే మాత్రం అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియకుండా ఉంది. ప్రభాస్ తో మారుతి సినిమా తీయడంపై ఫ్యాన్స్ లో కొంతమేర వ్యతిరేకత ఉందనిఅర్థమవుతోంది. కాగా ప్రభాస్-మారుతి మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. ప్రభాస్ 3 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.