కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీ రోలలో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ ఇప్పటికే తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. తలపతి విజయ్ , మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తుపాకీ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మార్కెట్ ను సృష్టించుకుని , ఆ తర్వాత నుండి తన మార్కెట్ కి పెంచుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే విజయ్ "బీస్ట్" అనే మూవీ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ని తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో విజయ్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం "రంజితమే" అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కి విడుదల అయిన రోజు నుండే ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రంజితమే సాంగ్ యూట్యూబ్ లో 91 మిలియన్ వ్యూస్ సాధించి సూపర్ జోష్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా అంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: