
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క టీము హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కాగా ఇప్పుడు దీనికి సహజమానిగా విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నారు. బ్లాక్ హాక్స్ టీంకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఈయన లీగ్ మ్యాచ్ లకు ఆవల ప్రచారం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వీక్షకుల ముందుకు విభిన్నంగా తన టీంను ప్రదర్శించనున్నట్లు సమాచారం. మరొకవైపు బ్లాక్ హాక్ ముఖ్య యజమాని అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ .. "విజయ్ దేవరకొండ మాతో చేరడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది.ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాదు ఇప్పుడు సహా యజమానిగా కూడా వ్యవహరించబోతున్నారు.
ముఖ్యంగా తనతో పాటు టీం కి కూడా నూతన విధానాన్ని తీసుకురావడం వల్ల మా బ్రాండ్ ను మరో దశకు తీసుకెళ్లగలిగాము. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించడమే మొదటి లక్ష్యసాధనగా అడుగులు వేస్తున్నాము. రాబోయే రోజుల్లో వాటి గురించి చాలా సంతోషించే అంశాలు కూడా వెలుగులోకి రాబోతున్నాయి అంటూ అభిషేక్ రెడ్డి కనకాల వెల్లడించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అని కాకుండా అంతకుమించింది అని తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వకారణం అని తెలిపారు.