బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 4 సంవత్సరాల విరామం తర్వాత పఠాన్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జనవరి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు లో కూడా పఠాన్ పేరుతోనే భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా , జాన్ అబ్రహం ముఖ్య పాత్రలో నటించాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి విశాల్ - శేఖర్ సంగీతం అందించారు.

చాలా సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన మూవీ కావడం ... అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇది వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్ లను తుడిచి వేసి మొదటి స్థానంలో నిలిచింది.

మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం కూడా ఈ సినిమాకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లు లభిస్తున్నాయి. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: