టాలీవుడ్ సీనియర్
హీరో మాస్
రాజా రవితేజ 'ధమాకా' సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ
సినిమా సూపర్
సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు
రవితేజ సినిమాకి కుర్ర
హీరో కిరణ్ అబ్బవరం
సినిమా పోటీగా రిలీజ్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న
కిరణ్ అబ్బవరం త్వరలో మీటర్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'క్లాప్ ఎంటర్టైన్మెంట్' 'మైత్రి
మూవీ మేకర్స్' సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా రమేష్ కాడూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.ఏప్రిల్ 7 వ తేదీన ఈ
సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ
కిరణ్ అబ్బవరంకి సంబంధించిన ఓ
పోస్టర్ ను కూడా
మూవీ యూనిట్ విడుదల చేశారు. అయితే అదే రోజున
రవితేజ నటించిన 'రావణాసుర'
సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.
సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని
రవితేజ హోమ్ బ్యానర్ అయిన 'ఆర్ టి టీం వర్క్స్' బ్యానర్ తో కలిసి 'అభిషేక్ పిక్చర్స్' సంస్థ నిర్మిస్తుంది.
నిజానికి 'రావణాసుర' సినిమాపైనే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. ఎందుకంటే 'ధమాకా' 'వాల్తేరు వీరయ్య' చిత్రాలతో
రవితేజ మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి
కిరణ్ అబ్బవరం
సినిమా రవి
తేజ మూవీ ముందు నిలబడటం కష్టమే.. ఒకవేళ 'రావణాసుర' టాక్ కొంచెం అటు ఇటు అయితే తప్ప
కిరణ్ అబ్బవరం 'మీటర్' ముందుకు వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. అయితే
కిరణ్ అబ్బవరం
ని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యి
కిరణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇంకా ఎక్కువగా
కిరణ్ అబ్బవరం ని ట్రోల్ చేస్తున్నారు. పైగా రవితేజాకే పోటీ ఇస్తున్నావా నువ్వు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే
కిరణ్ అబ్బరవరం 'మీటర్'కి 'మైత్రి
మూవీ మేకర్స్' వారి అండ కూడా అంది.అందుకే పోటీకి దిగాడా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.