
తమిళంలో సూపర్ హిట్ అయిన ఈమూవీ కథలో పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈమూవీకి స్క్రిప్ట్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చాల మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అంచనాలు బాగా ఉన్న ఈ సినిమాకు ఒక ఊహించని సమస్య వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు ప్రొడక్షన్ యూనిట్ విడుదల చేయనప్పటికీ ఈ మూవీ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తున్నాయి.
ఈసినిమాకు సంబంధించి తేజ్ అదేవిధంగా పవన్ కారులో తిరుగుతున్నట్లు ఒక ఫోటో పవన్ తేజ్ లు సముద్రం ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ రెండు ఫోటోలు ఈమూవీ యూనిట్ విడుదల చేయలేదని తెలుస్తోంది. దీనితో ఈఫోటోలు ఎలా లీక్ అయ్యాపరిశోధనలో ఈమూవీ యూనిట్ ఉన్నప్పటికీ సరైన సమాధానం వారికి తెలియలేదని అంటున్నారు.
దర్శకుడు సముద్రఖని ఈసినిమాను అత్యంత వేగంగా షూట్ చేస్తున్న పరిస్థితులలో ఇప్పటివరకు ఈమూవీ షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అయింది అంటున్నారు. తిరిగి వచ్చేవారం నుండి ఈమూవీ షూటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టి చాల వేగంగా తీయాలని సముద్రఖని భావిస్తున్నాడు. ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా బయ్యర్ల నుండి చాల ముందుగానే మంచి ఆఫర్స్ వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది..