కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ యువ దర్శకుడు అయినటు వంటి వ్యక్తి అట్లూరి దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. సంయుక్తా మీనన్మూవీ లో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. 

మూవీ తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా ఒకే రోజు విడుదల అయ్యి తెలుగు మరియు తమిళ భాషల్లో మంచి టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర  వసూలు చేసింది. ఈ మూవీ ధనుష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసినట్లుగా ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇలా ధనుష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ తెలుగు మరియు తమిళ  వర్షన్ లను ఈ నెల 17 నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ట్రేండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ... తమిళ వర్షన్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: