
అజిత్ తండ్రి మరణించారు అనే వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది .అజిత్ తండ్రి సుబ్రమణియన్ చెన్నైలో ఈ రోజున తుది శ్వాస విడిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అజిత్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. వీరీతో పాటు కోలీవుడ్ సినీ వర్గాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా మరింత తీవ్ర విషాదానికి లోనవుతున్నారు. ఇక అంతే కాకుండా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి అజిత్, షాలిని విడిపోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి.
అయితే ఇలాంటి వార్తలు అన్నిటికి చెక్ పెట్టే విధంగా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది దీంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్నారని సంతోషపడేలోపు అజిత్ తండ్రి మరణ వార్త విని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు.ప్రస్తుతం అజిత్ ఎక్కువగా తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక తన తండ్రి మరణ వార్తతో సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అజిత్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.