
మొదట ఈ చిత్రానికి సీఈవో ,సర్కారోడు అనే పేర్లు ఎక్కువగా ప్రచారంలో వినిపించాయి.. కానీ వాటికి భిన్నంగా గేమ్ చేంజర్ అనే ఒక సరికొత్త టైటిల్ ని ఖరారు చేశారు చిత్ర బృందం. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రాజకీయ వ్యవస్థలోని అవినీతిపైన పోరాటం చేసే ఎలక్షన్ ఆఫీసర్గా చరణ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ.. నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఇటీవల గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి షూటింగ్ హైదరాబాదులో 10 కోట్ల రూపాయలను ఖర్చుతో ఒక పాటను చిత్రీకరించడం జరిగింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి టైటిల్ వీడియో కూడా వైరల్ గా మారుతోంది. మరి ఈసారి రామ్ చరణ్ ఏ విధంగా అభిమానులను అలరిస్తారు చూడాలి మరి.