శ్రీరామనవమి రోజున విడుదలకాబోతున్న ‘దసరా’ పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సంక్రాంతి తరువాత సరైన మాస్ సినిమా రాకపోవడంతో మాస్ ప్రేక్షకుల ఆకలిని ‘దసరా’ తీరుస్తుంది అని అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే నాని కూడ గత నెల రోజులుగా ‘దసరా’ ప్రమోషన్ తప్ప మరే విషయం పట్టించుకోవడంలేదు.


నాని నార్త్ ఇండియాకు వెళ్ళి అక్కడ ‘దసరా’ కోసం రోడ్ షోలు చేయడమే కాకుండా కొన్ని ఫుడ్ పాయింట్స్ వద్ద ఛాట్ తింటూ అక్కడ జనాలను పలకరిస్తూ ‘దసరా’ ప్రమోట్ చేసాడు. ఇంత కష్టపడి నాని ప్రమోట్ చేసినా ‘దసరా’ గురించి బాలీవుడ్ మీడియా పెద్దగా పట్టించుకోవడంలేదు. అంతేకాదు బాలీవుడ్ మీడియా సంస్థలు నాని ఇంటర్వ్యూల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించలేదు అన్న వార్తలు కూడ వస్తున్నాయి.


దీనికితోడు ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ లక్నో లతో పాటు ముంబాయ్ కలకత్తా లలో కూడ ఎక్కడా ‘దసరా’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ ఓపెన్ కాలేదని ఆమూవీ గురించి పెద్దగా ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకోవడంలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలా జరగడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ‘దసరా’ విడుదల అవుతున్న తేదీ రోజునే అజయ్ దేవగణ్ నటించిన ‘భోళా’ మూవీ రిలీజ్ అవుతోంది.


‘ఖైదీ’ మూవీ రీమేక్ గా విడుదల అవుతున్న ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ‘పఠాన్’ భారీ విజయం తరువాత అదే స్థాయిలో ఈమూవీ విజయవంతం అవుతుందని బాలీవుడ్ మీడియా అంచనాలు వేస్తోంది. బాలీవుడ్ మీడియా ‘దసరా’ ను పక్కకు పెట్టి ‘భోళా’ ను ప్రమోట్ చేస్తూ ఉండటంతో నాని శ్రమ వృధా అయిందా అని అంటున్నారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా అదేవిధంగా ఎటువంటి ప్రమోషన్ లేకుండా విడుదలైన ‘కార్తికేయ 2’ ను బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా చూశారు. మరి అలాంటి రిజల్ట్ ‘దసరా’ కు వస్తుందో లేదో వేచి చూడాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: