
విరూపాక్ష రూపంలో తన కెరియర్లు మొదటిసారిగా ఒక హారర్ త్రిల్లర్ సస్పెన్స్ ఫాంటసీ ఎలిమెంట్తో కూడిన సినిమాలో నటించారు సాయి ధరంతేజ్. ఈ సినిమా కొత్త కథ కావడంతో ప్రేక్షకులను థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ కార్తీక్ కూడా ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని హైలెట్స్ పాయింట్స్ కూడా ఆడియన్స్ ట్విట్టర్ రూపంలో తెలియజేస్తున్నారు. సెకండాఫ్ లో ఇంట్రెస్టింగ్ కలిగి సన్నివేశాలు కూడా ఉన్నాయని సెకండ్ హాఫ్ అంత థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అని ఈ సినిమాలో లవ్ స్టోరీ కాస్త బోరింగ్ గా ఉంటుందని క్లైమాక్స్ సీన్ కూడా మైనస్ అని కొందరు తెలియజేస్తున్నారు. ఈ సినిమాతో తేజ్ మరొకసారి పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చారని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వాళ్ళు A సర్టిఫికెట్ ఇచ్చిన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.1980-90 రుద్రవరం అనే గ్రామంలో జరిగిన ఒక రియల్ కథతో కొన్ని కల్పితాలను జోడించి ఈ చిత్ర కథ ను రాసుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు.అయితే ఊర్లో జరుగుతున్న కొన్ని వరుస మరణాలకు మిస్టరీ వెనుక ఎలాంటి కథ ఉందని విషయాన్ని హీరో తెలుసుకోవడానికి ఈ సినిమా కథ. ముఖ్యంగా సుకుమార్ శిష్యుడైయుండి కార్తీక్ మంచి కథను ఎంచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సంయుక్త మీనన్ ఈ సినిమాకి ప్లస్ అని ఈమె నటన అద్భుతంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి తేజ్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.