తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. పోయిన సంవత్సరం రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" "ఆచార్య" అనే రెండు సినిమా లలో నటించాడు. ఇందులో "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో ఎన్టీఆర్ తో పాటు హీరోగా నటించిన చరణ్ "ఆచార్య" మూవీ లో చిరంజీవి హీరోగా నటించగా ... చరణ్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. 

ఇది ఇలా ఉంటే "ఆర్ ఆర్ ఆర్" మూవీ ద్వారా రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ లభించింది. నటుడుగా ఇప్పటికే తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న చరణ్ కొన్ని సంవత్సరాల క్రితమే కొణిదల ప్రొడక్షన్స్ సంస్థపై చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 ... సైరా నరసింహారెడ్డి అనే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాడు. ఈ మూవీ ల ద్వారా నిర్మాతగా కూడా చరణ్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా చరణ్ యూవి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి యు మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ లో మీడియం రేంజ్ హీరోలతో ... చిన్న హీరోలతో క్వాలిటీ సినిమాలను తీయాలి అనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ను చరణ్ స్థాపించినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తో ఒక మూవీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ని యు మెగా పిక్చర్స్ బ్యానర్ తో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరింది. తాజాగా ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను ఈరోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు "ఇండియా గేట్" అనే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: