టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు. 

మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి రూపొందించారు. అలాగే ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ ను ఈ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి "హెడ్ అప్ హై" అంటూ సాగే వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేసినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ మూవీ లోని ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగ చైతన్య నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కాకపోతే ఈ సినిమా స్క్రీన్ ప్లే లో లోపాలు ఉండడం తో ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: