మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో రంగస్థలం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాలో.. రామ్ చరణ్ తనలో కొత్త నటుడిని ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించగా ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.


 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది అని చెప్పాలి. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసుకుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటించగా.. ఇక ఒక రకంగా చిట్టిబాబు పాత్రకి ప్రాణం పోసాడు రామ్ చరణ్ అని చెప్పాలి.  ఈ క్రమంలోనే తన నటనకు గాను విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. అయితే రామ్ చరణ్ రంగస్థలం మూవీ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


 రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా చరణ్ తండ్రి చిరంజీవి నటించిన ఒక ఓల్డ్ సినిమాకు కాపీ అంటూ వార్త వైరల్ గా మారిపోయింది. ధవళ సత్యం దర్శకత్వంలో చిరంజీవి చేసిన జాతర సినిమాకు అటు రంగస్థలం రీమేక్ అట. ఇంద్రాణి ఇందులో హీరోయిన్గా నటిస్తే శ్రీధర్, నాగభూషణం, జయలక్ష్మి తదితరులు కీలకపాత్రలను పోషించారు. 1980లో ఈ సినిమా విడుదలైంది. అయితే రామ్ చరణ్ రంగస్థలం అచ్చం చిరంజీవి జాతర సినిమాను పోలి ఉంటుంది. రెండు సినిమా స్టోరీలు పాత్రలు దాదాపు ఒకేలా ఉంటాయి. జాతర సినిమాలో చిరంజీవి అన్న పాత్ర చనిపోతుంది. ఇక ప్రెసిడెంట్ పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేయడం.. ఊరు ప్రజలంతా ప్రెసిడెంట్ ను తరిమికొట్టడం లాంటి సన్నివేశాలు ఉంటాయి. రంగస్థలంలోని ఇదే చూపించాడు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: