కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగలించిన వివాదం ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ వివాదంలో ఆఫీస్ బాయ్ రఘు, చరిత కలిసి ఈ పని చేశారని మంచు విష్ణు వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారు.. ఇక మంచు విష్ణు అయితే నిన్ను కొలిచే నాకు ఏంది సామీ ఈ తిప్పలు అన్నట్లుగా సోషల్ మీడియాలో శివయ్యని ఉద్దేశించి పోస్ట్ లు పెడుతున్నారు. అయితే చరిత సూచనల మేరకే ఆఫీస్ బాయ్ రఘు ఈ పని చేశారని మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ ద్వారా స్పందించారు.ముంబైలోని హైవ్ స్టూడియో నుండి 24 ఫ్రేమ్స్ స్టూడియోకి ఒక హార్డ్ డ్రైవ్ కొరియర్ చేశారు. అయితే దీన్ని చట్ట విరుద్ధంగా ఆఫీస్ బాయ్ రఘు సంతకం పెట్టి మరీ తీసుకున్నారు.

అలాగే చరిత చెప్పడం వల్లే రఘు ఈ పని చేశారు. ఇక చరిత,రఘు వీళ్ళిద్దరూ 24 ఫ్రేమ్స్ ప్రతినిధులు కాదు. అందులో పని చేసే ఉద్యోగులు మాత్రమే. ఇక ఈ హార్డ్ డిస్క్ దొంగతనం చేయమని చెప్పింది ఎవరో కూడా నాకు తెలుసు అంటూ మంచు విష్ణు పోస్ట్ పెట్టారు. అయితే మంచు విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో ఈ పోస్ట్ పెట్టే కంటే రెండు రోజుల ముందు మంచు మనోజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మంచు మనోజ్ భైరవం మూవీ ఈవెంట్ లో ఏం మాట్లాడారంటే.. చరిత థాంక్స్ అమ్మ.. నువ్వు అమ్మాయివి అయినా కూడా మగవాళ్లే సిగ్గుపడేలా నీతి నిజాయితీతో పని చేశావు..

 అన్ని విషయాల్లో అండగా నిలబడ్డావు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నా స్టాఫ్ నాకోసం అండగా నిలబడ్డారు. వారందరికీ థాంక్స్ అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.అయితే వీరందరిలో చరిత పేరు చెప్పి మరీ ఆమెకు అభినందనలు తెలియజేయడంతో మంచు మనోజే ఈ పని చేయించారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మనోజ్ కి నమ్మకంగా ఉన్న చరిత 24 ఫ్రేమ్స్ లో వర్క్ చేస్తూ విష్ణు కన్నప్ప మూవీపై దెబ్బ కొట్టిందని ఇదంతా మనోజ్ కుట్రే అని కొంతమంది నెటిజన్స్ మనోజ్ మాట్లాడిన ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: