గత రెండు మూడు రోజుల నుంచి టాలీవుడ్లో ఎగ్జిబిటర్ల వివాదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే నిర్మాత మండలిలో కూడా ఈ విషయం పైన స్పందించగా థియేటర్లో బంద్ అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. అయితే కొన్ని కారణాల చేత థియేటర్ల బంద్ విషయం వెనక్కి తగ్గినప్పటికీ ఇప్పుడు హీరోలకు ఈ ఎగ్జిక్యూటర్ల వివాదం తాకినట్లుగా కనిపిస్తోంది. థియేటర్లు నష్టాలలో ఉన్నాయని తమకు వర్కౌట్ కాలేదంటూ ఎగ్జిబిటర్లు వెల్లడించారు..టికెట్ ధరలు తగ్గిస్తేనే ప్రేక్షకులు సినిమాలు చూడడానికి వస్తున్నారని పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.


టికెట్లు ధరలకంటే ముఖ్యంగా సినిమా హాళ్లలో తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని వీటి వల్లే సామాన్యులు థియేటర్లకు రాలేదంటూ తెలిపారు. అయితే తాజాగా రాజమండ్రి ఎగ్జిబిటర్లు సైతం ఈ వివాదంపై మరింత స్పందిస్తూ హీరోలు కలగజేసుకుంటేనే థియేటర్లు రన్ అవుతాయని హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలంటూ సూచనలు ఇచ్చారు. కనీసం ఏడాదికి రెండు మూడు చిత్రాలు అయినా చేయాలి అంటూ సలహా ఇచ్చారు. మరి దీంతో అసలు హీరోలు రెమ్యూనరేషన్ తగ్గిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మొదలవుతోంది.


కోట్ల రూపాయలు తీసుకుంటున్న హీరోల సినిమాలు ఫ్లాప్ అయిన కూడా నిర్మాతలకు ఏ మేరకు వెనక్కి ఇవ్వకపోవడంతో చాలా నష్టాలను చవిచూస్తున్నారు. ఇక ఇలాంటి సినిమాలు కొన్న బయ్యర్లు సైతం చాలా నష్టాలను చవిచూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ తగ్గించడం అనేది మంచిదే అయినా హీరోలు తగ్గిస్తారా అనే ప్రశ్న మిలియన్ డాలర్ల గాని మిగిలింది. మరి ఈ విషయాల పైన హీరోలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


ప్రస్తుతమున్న పరిస్థితులలో థియేటర్లలో రోజుకి రెండు షోలు వేసి థియేటర్లు మూసి వేస్తున్నామని బయ్యర్లు తెలుపుతున్నారు. సినిమాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేశామని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ ధరకే అమ్ముతున్నారని అడ్వాన్సుల కింద 40 నుంచి 50 లక్షలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారు. ఏపీలో చాలా మటుకు థియేటర్లు మూసివేసి ఫంక్షన్ హాళ్లు షాపింగ్ మాల్స్ వంటివి పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: