
ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ను వాయ్ పాయి ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. చిన్న రాష్ట్రమే అయినా అత్యధిక వనరులున్న రాష్ట్రం. మంచు, పచ్చదనం, పర్యాటకం ఇవే ఆ రాష్ట్రానికి ఆదాయాన్ని కలిగించే అంశాలు. ఉత్తరాఖండ్ లో అనేక ఆలయాలు ఉన్నాయి. అందుకే అక్కడికి దేశవిదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. ఇదిలా ఉంటె, ఆ రాష్ట్ర పరిపాలన మొత్తం డెహ్రాడూన్ నుంచి సాగుతుంది.
రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సమయంలో నైనిటాల్ లో హైకోర్టును ఏర్పాటు చేశారు. పరిపాలన పరంగా డెహ్రాడూన్ నుంచి, న్యాయపరంగా నైనిటాల్ నుంచి పరిపాలన సాగుతుంది. అంటే ఆ రాష్ట్రానికి రెండు రాజధానులు ఉన్నట్టు. అయితే, 2012లో అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బహుగుణ డెహ్రాడూన్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న గైర్సన్ లో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. అక్కడ రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నారు.
చాలామంది ప్రజలు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాటం చేశారు. అప్పుడప్పుడు బడ్జెట్ సమావేశాలు గైర్సన్ లో జరుగుతుండేవి. కానీ పరిమినెంట్ గా జరిగేవి కాదు. 2014లో ఈ క్యాపిటల్ గురించి మరోసారి చర్చల్లోకి వచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు అధికారం ఇస్తే సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఆ అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వబోమని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది.
బీజేపీ చెప్పినట్టుగా గైర్సన్ ను సమ్మర్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరిపాలన డెహ్రాడూన్ నుంచి జరిగినా సమ్మర్ లో మాత్రం పరిపాలన గైర్సన్ నుంచి జరుగుతుంది. నైనిటాల్ లో హై కోర్టు ఉన్నది. దీంతో ఉత్తరాఖండ్ లో మూడు రాజధానులు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఏపీలో ఇదే విధంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖనుంచి పరిపాలన, అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్ట్ ఇలా మూడు చోట్ల నుంచి మూడు విధాలైన పరిపాలన జరగబోతున్నది.