మానవ శరీరంలో నయనం ప్రధానం అంటారు.  శరీరంలో కళ్ళు చాలా ప్రధానమైన అవయవం.  కళ్ళు  లేకుండా మనం ఈ ప్రపంచాన్ని చూడలేం.  ఆ విషయం అందరికి తెలుసు.  కళ్ళు చాలా సున్నితమైన అవయవం.  శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నా దాని ఎఫెక్ట్ కంటిపై పడుతుంది.  అందుకే కళ్ళను చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి.  కంటి జబ్బుల నుంచి కళ్ళను రక్షించుకోవడానికి కనీసం ఆరు నెలలకు ఒకసారైనా కళ్ళను పరీక్ష చేయించుకోవాలి.  

ఇకపోతే, మొదటగా కరోనా వైరస్ ను చైనాలో గుర్తించిన సంగతి తెలిసిందే.  గ్లూకోమా వ్యాధితో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ కళ్ళలో వైరస్ ను గుర్తించారు. దానిని చైనా మొదట కొట్టిపారేసింది.  తరువాత చైనా అలర్ట్ అయ్యింది.  ఈ కాలంలో నూటికి 70శాతం మంది కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతున్నారు.  తలనొప్పి, సైట్ వలన కళ్ళజోడు తగిలించుకొని తిరగాల్సి వస్తోంది.  

కళ్ళజోడు పెట్టుకునేవారికి వైద్యులు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.  కరోనా వైరస్ కళ్ళజోడుపై ఎంతకాలం ఉంటుంది అనే దానిపై వైద్యులు కొన్ని  చేశారు.  ఈ  పరిశోధనల ఫలితాలను ఇటీవలే రిలీజ్ చేశారు.  కళ్ళజోడుపై వైరస్ దాదాపుగా 9 రోజులపాటు బతికి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వెళ్లే సమయంలో కళ్లజోడును ఎప్పటికప్పుడు నీట్ గా శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

అయితే, కళ్ళజోడును శానిటైజర్ తో కాకుండా, హైడ్రోజన్ పెరాక్సయిడ్ తో క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కళ్ళజోడు పెట్టుకోవడమే కాకుండా, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.  అయితే, ఇటీవలే యూనిసెఫ్ కొన్ని సూచనలు చేసింది.  వైరస్ దీనిపై ఎంతకాలం ఉంటుంది అనే దానిపై కొన్ని  విషయాలను పేర్కొన్నది.  దాని ప్రకారం, వైరస్ బట్టలపైనా, ఇతర వస్తువులపైన 12 గంటల వరకు బతికి ఉంటుందని పేర్కొన్నది.  
బయటకు వెళ్లి వచ్చిన వ్యక్తులు బట్టలను బయట ఎండలో రెండు గంటల పాటు ఉంచితే వైరస్ చనిపోతుందని యూనిసెఫ్ పేర్కొన్నది.   

మరింత సమాచారం తెలుసుకోండి: