కరోనా కేసులు దేశంలో రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  ఇప్పటికే ఇండియాలో 36 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఇక మరణాల సంఖ్య కూడా 67 వేలు దాటిపోయింది.  కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  రికవరీ రేటు పెరుగుతున్నా, యాక్టివ్ కేసులు కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతున్నాయి.  దీంతో పాటు మరణాల రేటు కూడా పెరుగుతున్నది.  

ఈరోజు కూడా ఇండియాలో 78 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  గత వారం రోజులుగా ఇండియాలో ప్రతి రోజు 70వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.  కరోనా పట్టికలో ఇండియా మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు కేసులు పెరుగుతుంటే, మరోవైపు ఆంక్షలు సడలిస్తుండటం ఎంతవరకు సమంజసం అన్నది తెలియాల్సి ఉన్నది.  సడలింపులు ఉన్నప్పుడే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  

సడలింపులు ఎత్తివేస్తే ఇక ఏ స్థాయిలో కేసులు నమోదవుతుంటాయో చెప్పనవసరం లేదు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకు కేసులు నమోదయ్యే సూచనలు ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వచ్చే ఏడాది మార్చి వరకు వాక్సిన్ రావొచ్చని ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  అప్పటి వరకు కరోనాతో సహజీవనం చేయక తప్పదని ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరించాయి.  ఒకవేళ వాక్సిన్ వచ్చినప్పటికీ కూడా అది ఎంత వరకు సమర్ధవంతంగా పనిచేస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు.  

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలను ఎత్తివేసాయి.  అంతరాష్ట్రాల సరిహద్దుల వద్ద నిబంధనలు ఎత్తివేశాయి.  రాష్ట్రాల మధ్య వాహనాలు గతంలో మాదిరిగానే యధాతధంగా తిరుగుతున్నాయి.  ఇటు ప్రజలు కూడా కరోనాకు పెద్దగా భయపడుతున్నట్టు కనిపించడం లేదు.  కరోనా వస్తే నాలుగు రోజులు రెస్టు తీసుకుందాం అనే ధోరణిలోనే ఉన్నారు తప్పించి కరోనాకు భయపడటం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగిన మొహర్రం ర్యాలీ.  మొహర్రం ర్యాలీలో కరోనా నిబంధనలు పాటించకుండా ర్యాలీని నిర్వహించారు.  ఆ ర్యాలీలో పాల్గొన్న ఎంతమంది కరోనా ఉన్నదో ఎవరు చెప్పగలుగుతారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: