తమ రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా విమర్శలు చేస్తూ, గత కొంతకాలంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం పైన కానీ, సీఎం జగన్ పైన కాని ఎవరైనా విమర్శలు చేస్తే అందరికంటే ముందుగా నాని రియాక్ట్ అవుతారు. ఘాటు వ్యాఖ్యలతో సమాధానం చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ , మాజీ టీడీపీ మంత్రి దేవినేని ఉమ వంటి వారు వ్యవహారాలపై ఎక్కువగా నాని స్పందిస్తూ హడావుడి చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా ఇదే రాజకీయం నడుస్తూ వస్తోంది. చంద్రబాబు, లోకేష్ , దేవినేని ఉమాలపై నాని వాడే తిట్ల పురాణం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, ఆయన ప్రసంగాలకు మాత్రం ఏపీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. చంద్రబాబును అసభ్య పదజాలంతో తిడుతున్న నాని విమర్శలపై హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  వార్నింగ్ ఇవ్వడం వంటివి ఇప్పుడు నానీ దగ్గర మీడియా ఆ సందర్భాన్ని ప్రస్తావించగా, బాలయ్య పైనా నాని విమర్శలు చేశారు.






బాలయ్య ఆటలో అరటిపండు వంటి వాడని, మాట్లాడడానికి ఏముంటుంది అంటూ నాని విమర్శించారు.ఎన్టీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని ఆయన ఎంతో ఎత్తున ఉంటారని,  అటువంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఆయన పదవిని లాక్కున్న వ్యక్తి అని, ఆయన వెనుక బాలకృష్ణ నిలబడ్డారని, ఆయనకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, అటువంటి వ్యక్తి గురించి తాను ఏమి మాట్లాడాలి అంటున అని ఎదురు ప్రశ్నించారు. 





అదే తన తండ్రిని ఎవరైనా ఈ విధంగా చేసి ఉంటే తాను ఊరు వదిలి పెట్టే వాడిని కాదని అన్నారు. కానీ బాలయ్య మాత్రం తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దతుగా నిలబడుతున్నారు అంటూ నాని విమర్శించారు. పులి కడుపున పులే పుడుతుంది అని ఈ విషయం జగన్ ద్వారా  రుజువు అయ్యిందని నాని అన్నారు. కానీ ఎన్టీఆర్ విషయంలో ఇలా అయింది ఏంటో అని బాలయ్య ని చూసి అనుకుంటున్నారు అంటూ నాని సెటైర్స్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: