
ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్లకు పైగా డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పుడు పిల్లలు, 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఐదేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు మాస్కులు సిఫార్సు చేసేది లేదని కేంద్ర కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న పిల్లల కోసం కొన్ని సూచనలు చేసింది. తగిన విధంగా సురక్షితంగా ఉపయోగించగలిగిన 6 నుంచి 11 సంవత్సరాల వయస్సున్న పిల్లలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించింది. 12 ఏళ్లు పై బడిన వయసున్న వాళ్లు... మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను సవరించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ ఆందోళన కలిగించే వైవిధ్యం కావడంతో నిపుణుల బృందం దీనిపై ప్రధానంగా చర్చించింది.