కీలకమైన రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఒకేలాగుంది. రెండు నియోజకవర్గాల్లోను గట్టి అభ్యర్ధులు లేక పార్టీ నానా అవస్తలు పడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంత కీలకమైనవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి చోట్ల పార్టీకి సరైన అభ్యర్ధులు దొరకటంలేదు. గుడివాడలో కొడాలినాని, గన్నవరంలో వల్లభనేని వంశీలను ఓడించేందుకు ధీటైన అభ్యర్ధులను వెతకటంలోలనే చద్రబాబునాయుడుకు పుణ్యకాలం గడిచిపోతోంది.





దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో గన్నవరం పార్టీలోని డొల్లతనం బయటపడింది. చింతమనేని మాట్లాడుతు గన్నవరంలో టికెట్ ఇస్తే ఖర్చు పెట్టుకోవటానికి రు. 150 కోట్లతో ఒకళ్ళు  రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఒకళ్ళన్నారే కానీ ఆ ఒక్కళ్ళు ఎవరో చెప్పలేదు. దాంతో నియోజకవర్గంలోని తమ్ముళ్ళల్లో  ఎవరు గట్టివాళ్ళు లేరన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధిని వెదికేందుకు జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి బాధ్యత అప్పగించారు.





అయితే ఆయన హఠాత్తుగా పోయారు. దాంతో తాత్కాలికంగా నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణకు అప్పగించారు. అయితే ఆయన కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. దాంతో అభ్యర్ధుల వడపోత కార్యక్రమం జరగటంలేదు. వైసీపీలో ఉన్న దాసరి బాలవర్ధనరావు, దాసరి జై రమేష్ తొందరలోనే టీడీపీలో చేరుతారనే ప్రచారం ఉంది. అలాగే వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులో ఒక్కళ్ళు టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.





వీళ్ళల్లో వైసీపీ నుండి టీడీపీలోకి దూకేదెవరు ? టికెట్ తెచ్చుకునేదెవరు ? అనే విషయంలో బాగా అయోమయం పెరిగిపోతోంది. పార్టీ మారబోతున్నట్లు పై నలుగురిలో ఏ ఒక్కళ్ళు చెప్పలేదు. దాంతో ఇప్పటికి పార్టీలోని తమ్ముళ్ళల్లో ఎవరు కూడా వంశీని ఎదిరించేంత సీనున్న వాళ్ళు లేరనేది అర్ధమైపోయింది. ఏకకాలంలో అటు గుడివాడ ఇటు గన్నవరంలో ఇద్దరు ధీటైన అభ్యర్ధులను వెతకాలంటే చంద్రబాబుకు చాలా కష్టమనే చెప్పాలి. మరి చంద్రబాబు ఏమి ప్లాన్ చేస్తున్నారో, చివరినిముషంలో ఎవరిని రంగంలోకి దింపుతారో చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: