
రోజు అక్కడికే వెళ్తున్నావా. నక్క ప్రశ్నించింది? అవును అయితే ఏం..
చుట్టూ అన్ని పంటపొలాలు ఉన్నాయి. కదా! వాటిలో పడి తినొచ్చుగా.. సలహా చెప్పింది నక్క
అలా చేయడం తప్పు... ఒకవేళ ఆ పంట యజమానికంటపడితే... వీపు విమానం మోతే గాడిద చెప్పింది.అలా ఏం జరగదు నాతో వస్తే నీకు మొక్కజొన్నపొత్తులు తినిపిస్తా ఆని ఆశ చూపింది నక్క
నేను రాను నువ్వు వెళ్ళవచ్చు. గాడిద కోపంగా చెప్పేసరికి వెళ్ళిపోయింది నక్క..కొన్ని రోజులు గడిచాయి రోజు ఇలానే నక్క వచ్చి గాడిదని కలుసుకొని కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయేది.
ఓ రోజు... గాడిద బావా.. నాకున్నఓకే ఒక మంచి స్నేహితుడువి నువ్వే మన స్నేహానికి గుర్తుగా నీకు విందు ఇద్దామనుకున్నాను అంది నక్కవిందా.... ఎక్కడ? ఆశగానే అడిగింది గాడిద నేనో మొక్కజొన్న తోట చూశాను.అక్కడి జొన్న పొత్తులు ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా! వస్తే నీకు పెడతా అని ఎర వేసింది నక్క.
దొంగతనంగా వెళ్లి తినడం తప్పు కద అని వాదించింది గాడిద..పోనీ.. ఒక పని చేద్దాం నువ్వు పొలం బయటనే నిలబడు నేను చేలోకి వెళ్లి జొన్న పొత్తులు తీసుకొస్తా అంది నక్క నేను రాను అని చాలా సేపు చెప్పిన గాడిద నీ స్నేహం కోసం ఈ మాత్రం చేయలేవా... అని నక్క బ్రతిమాలిసరికి వెంట వెళ్లడానికి ఒప్పుకుంది. గాడిదను లో జొన్న తోట దగ్గరకి తీసుకొని వెళ్ళింది. నక్క.. గంటలు గడుస్తున్నాయి... కానీ చేలోకి వెళ్లిన నక్క మాత్రం ఎప్పటికీ రాలేదు.మిత్రమా... లోపల ఏం చేస్తున్నావ్ బయటికిరా! పిలిచింది గాడిద అయినా నక్క రాలేదు. మరోసారి అరిచింది ప్రయోజనం లేదు. చివరిగా వస్తున్నావా లేదా అనేసరికి ఆ అరుపులు దూరాన పొలంలో ఉన్న యజమాని చెవిన పడ్డాయి.
అంతే ఓ కర్ర పుచ్చుకొని పరుగున వచ్చి..నా పొలాన్ని నాశనం చేస్తుంది నువ్వా! ఈరోజు నీ ప్రాణాలను తీస్తా అంటూ గాడిదని చితకబాదాడు. అరుపులు చేలో వున్న నక్కకు వినిపించాయి. అది తెలివిగా అక్కడి నుంచి పారిపోయింది.దొంగ బుద్ధి ఉన్న నక్కతో స్నేహం చేసి నందుకు బాధపడుతూ గాడిద నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయింది.