
ఇలా ఇటీవల అడవుల్లోకి పర్యటకులకు ఏకంగా జంతువులు దాడి చేసిన చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయ్. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అడవిలో ఉండే అతి భయంకరమైన జీవులలో అటు పులి కూడా ఒకటి. సింహం తర్వాత ఆ రేంజ్ లో బలం కలిగి ఉండేది పులి మాత్రమే అని చెబుతూ ఉంటారు. అలాంటి పులి ఒక్కటి ఎదురుపడితేనే ప్రాణం గాల్లో కలిసిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఇక్కడ టూరిస్టులు ప్రయాణించే వాహనాన్ని పులులా గుంపు ఏకంగా వెంబడించడం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఒక టూరిస్ట్ బస్సు రోడ్డుపై వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా పులుల గుంపు బస్సును వెంబడించింది. ఏం జరుగుతుందో చూసేలోపే బస్సు వాటిని దాటి వెళ్లిపోయింది అని చెప్పాలి. ఇక పులులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఒక పులి అయితే ఏకంగా బస్సులో ఉన్న ప్రయాణికులను గాయపరిచేందుకు పంజా విసరడం కూడా ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో చూసి భయపడిపోతున్న నేటిజన్స్.. భిన్నమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.