హోండా కంపెనీ ఒక కొత్త బైక్ ని లాంచ్ చేసింది. అదే హోండా షైన్ 100 బైక్. ఇక దీని పనితీరు దాదాపుగా హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ లాగానే ఉంటుంది. ఈ బైక్ 97.2 cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా పవర్ ని ఇస్తుంది. ఈ బైక్ 7.5 Bhpతో 8.05 Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హోండా షైన్ 100 4-స్పీడ్ గేర్‌ బాక్స్‌తో వస్తుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు దీని ఇంజిన్ స్టార్ట్ కాదు.ఈ హోండా కొత్త బైక్ మెయిన్ గా స్ల్పెండర్‌ కు పోటీగానే మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మన దేశంలో మొత్తం 33% మోటార్‌సైకిల్ విక్రయాలు 100cc సెగ్మెంట్‌లో నమోదవుతుంటాయి. ఇక హీరో స్ప్లెండర్ ఈ సెగ్మెంట్‌లో దాదాపు 2,50,000 యూనిట్ల నెలవారీ విక్రయాలతో టాప్ సెల్లింగ్ బైక్‌గా నిలిచింది. హోండా ప్రస్తుతం ఈ విభాగంలో షైన్ 100 మోటార్‌సైకిల్‌తో ఆదిపత్యం చెలాయించాలని ట్రై చేస్తుంది. అంతేకాక హెచ్‌ఎఫ్ డీలక్స్, హెచ్‌ఎఫ్ 100, బజాజ్ ప్లాటినా 100 ఇంకా అలాగే టీవీఎస్ స్టార్ సిటీలతోనూ ఈ బైక్ పోటీపడనుంది.


ఇక కస్టమర్లు హోండా షైన్ 100 బైక్‌ను అథారైజ్డ్‌ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. హోండా షైన్ 100 తయారీ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. డెలివరీలు 2023, మే నెలలో స్టార్ట్ అవుతాయి. ఈ ఆల్ న్యూ బైక్ బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్ ఇంకా బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కి 65 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వనుందని సమాచారం తెలుస్తుంది.హోండా షైన్ 100 స్పెషల్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, నారో లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో తేలికైన ఇంకా అలాగే మన్నికైన స్టీల్ ఫ్రేమ్‌తో లాంచ్ అయింది. ఇందులో ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం గ్రాబ్ రైల్ ఇంకా అలాగే ఇంజన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్, కాంబి-బ్రేక్ సిస్టమ్ కూడా అందించారు. దీనికి సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు కూడా ఉన్నాయి.ఇక బ్రేకింగ్ పవర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)తో పాటు ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో ఈ బైక్ మార్కెట్లోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: