ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు అమరావతి రాగం ఆలపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇవాళ బిజెపి పాదయాత్ర చేయబోతోంది. గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పాదయాత్ర నిర్వహిస్తారు. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో యాత్రను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభిస్తారు. మనం-మన అమరావతి పేరుతో  పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర ఆగష్టు 4వ తేది వరకు పాదయాత్ర   జరగబోతోంది.


ఉండవల్లిలో మొదలయ్యే ఈ మనం- మన అమరావతి పాదయాత్ర.. అక్కడి నుంచి మొదటి రోజు పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం వరకు కొనసాగుతుంది. ఇలా రోజూ అమరావతి గ్రామాల్లో ఈ పాదయాత్ర జరగబోతోంది. అయితే.. ఈ యాత్ర వల్ల బీజేపీ ఏమేరకు లబ్ది పొందుతున్నది మాత్రం సందేహమే. అమరావతి నినాదం అరిగిపోయిన నినాదం.. పైగా ఈ నినాదం రాజకీయంగా పెద్దగా ఏ పార్టీకీ మేలు చేయలేదు. మరి బీజేపీ ఇప్పుడు అమరావతి రాగం ఆలపించడం వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అంటే.. అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp