
లోక్ నాయక్ ఫౌండేషన్ గడిచిన 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఎన్టీ రామారావు వర్ధంతి, హరివంసరాయి బచ్చన్ వర్ధంతి సందర్భంగా వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీన విశాఖ వి ఎం ఆర్ డి ఏ బాలల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాలను సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు కూచిభట్ల ఆనంద్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ, రాజమండ్రిలోని జిఎస్ఎల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావుకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నామని.. ఇందులో ప్రముఖ నటి జయప్రద, జయసుధలకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నామని ఫౌండేషన్ ప్రకటించింది.