ఎస్సీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు మళ్లించకూడదని గతంలో చట్టం ఉన్నప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించిందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద అమలు జరగాల్సిన 26 పథకాలను రద్దు చేశారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఎస్సీ కార్పోరేషన్ కింద అమలు జరగాల్సిన 26 పథకాలను మళ్లీ అమలు చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కన్నా లక్ష్మీనారాయణ 48 గంటల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ కార్యక్రమానికి అతిధులుగా మహారాష్ట్రకు చెందిన శంభునాధ్ తుండియా, రాష్ట్ర సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వింత పోకడ కనిపిస్తుందని... చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్ ది మోసపూరిత వ్యాపార దృక్పథమని... ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ సంక్షేమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ  ఆరోపించారు. పోలీసు వ్యవస్థను ఇంతలా దిగజార్చిన ఘనత జగన్ దేనని కన్నా లక్ష్మీనారాయణ  విమర్శించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: