తెలంగాణలోని 20లక్షల విద్యార్థులకు, 30లక్షల నిరుద్యోగులు ఉన్నారు. వారు నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన లీకేజీ బాగోతం వారిలో తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీన బీఆరెస్ లో చేరిన వ్యక్తికి మే 2వ తేదీన సీఎం ప్రైవేటు కార్యదర్శిగా నియమించారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయటపెట్టిన రహస్యం వారిలో ఆగ్రహం కలిగిస్తోంది. అందుకు సంబంధించిన జీవోను రేవంత్ రెడ్డి మీడియా ముందు ఉంచారు.


జీవోలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని హై కొర్టు చెప్పినా రహస్యంగా ఉంచుతున్నారని  రేవంత్ రెడ్డి  విమర్శించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆరెస్ లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారని..  విమర్శించారు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారని  రేవంత్ రెడ్డి  ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: